అనంతగిరి మండలం ఇంచార్జ్ ఎంపీపీగా ఊర్మా శకుంతలను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను శుక్రవారం జారీ చేశారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీల అవిశ్వాసంతో ఖాళీ అయిన ఎంపీపీ స్థానానికి ఊర్మా శకుంతల ఇంచార్జి గా వ్యవహారిస్తారు. కొత్త ఎంపీపీ ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చేవరకు ఆమె ఆపద్ధర్మ ఎంపీపీ గా కొనసాగుతారు.