సే నోటు డ్రగ్స్ పోస్టర్ ఆవిష్కరణ
NEWS Dec 20,2025 10:42 am
కథలాపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ‘సే నో టు డ్రగ్స్’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. యువత డ్రగ్స్ జోలికి వెళ్లి తమ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్ఐ నవీన్ కుమార్ హితవు పలికారు. చెడు వ్యసనాల నుంచి దూరంగా ఉండి భవిష్యత్తుపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ కార్యక్రమం 60 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. బీఎస్ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు నల్లవర్ధన్, ఉపాధ్యక్షుడు వినీత్, మండల నాయకుడు శశి తదితరులు పాల్గొన్నారు.