TSUTF గోడ పత్రిక ఆవిష్కరణ
NEWS Dec 20,2025 08:54 pm
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాల సందర్భంగా జనగామ పట్టణంలో నిర్వహిస్తున్న విద్యా సదస్సు, ప్రతినిధుల సభల గోడపత్రికను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అలాగే వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. విద్యా రంగ సమస్యలపై చర్చలు జరిపి, ఉపాధ్యాయుల హక్కులు, విద్యా అభివృద్ధిపై కార్యాచరణ రూపొందించనున్నట్లు నేతలు తెలిపారు.