భగ్గుమన్న బంగ్లా.. మీడియా ఆఫీసులకు నిప్పు
NEWS Dec 19,2025 07:29 pm
బంగ్లాదేశ్‌లో యువ నేత షరీఫ్ ఉస్మాన్ హది (32) మృతితో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు చెలరేగాయి. రాజధాని ఢాకాలో ఆందోళనకారులు 2 వార్తాపత్రికలు ప్రథమ్ ఆలో, ది డైలీ స్టార్ కార్యాలయాలపై దాడి చేసి నిప్పంటించారు. ఈ ఘటనలో సుమారు 25 మంది జర్నలిస్టులు భవనంలో చిక్కుకోగా, బంగ్లాదేశ్ ఆర్మీ 4 గంటల పాటు ఆపరేషన్ చేసి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ఎడిటర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు నూరుల్ కబీర్‌పై కూడా దాడి జరిగింది. పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది.