‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ మరోసారి పాండోరా ప్రపంచాన్ని అద్భుత విజువల్స్‌తో మన ముందుకు తెచ్చింది. ఈ భాగంలో మాంగ్వాన్ అనే కొత్త తెగ ప్రవేశంతో కథకు కొంత వేగం, యాక్షన్ పెరిగాయి. ‘వే ఆఫ్ వాటర్’తో పోలిస్తే కథ పరిధి విస్తరించినా, మూలంగా మనుషులు–నావీల మధ్య పోరాటమే కొనసాగుతుంది. విజువల్ ఎఫెక్ట్స్ కళ్లు చెదిరేలా ఉన్నా, కొత్తదనం తక్కువ. 3 గంటల నిడివి ఓవర్ డోస్ ఫీలింగ్ ఇస్తుంది. కథకన్నా విజువల్స్ కోసం చూస్తే మాత్రం నిరాశ ఉండదు. రేటింగ్: 2.75/5
- Swamy Muddam