జీరుగెడ్డ: జియో సిగ్నల్ సమస్యపై ఆందోళన
NEWS Dec 19,2025 07:31 pm
అనంతగిరి మండలంలోని బొర్రా పంచాయతీ పరిధిలోని జీరుగెడ్డ గ్రామం గ్రామస్తులు జియో సిగ్నల్ అందుబాటులో లేదని శుక్రవారం ఆందోళన చేపట్టారు. కూలీ నాలి చేసుకుని సకాలంలో ఫోన్లకు రీచార్జ్‌లు చేసుకున్నప్పటికీ తమ గ్రామంలో జియో సిగ్నల్, నెట్ సేవలు పనిచేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో కమ్యూనికేషన్ సమస్యల వల్ల అత్యవసర అవసరాల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. సంబంధిత జియో టవర్ యాజమాన్యం వెంటనే స్పందించి 5జీ సిగ్నల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.