వడ్డాది పంచాయతీలో పారిశుద్ధ్య డ్రైవ్
NEWS Dec 19,2025 07:30 pm
వడ్డాది మేజర్ పంచాయతిలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ కె. కమలక్ష్మి, ఈఓ ఎంపీఎస్ లవరాజు పర్యవేక్షణలో సిబ్బంది ఈ పనుల్లో పాల్గొన్నారు. సంత బయలు ప్రాంతంలో చెత్తను తొలగించి రోడ్లను శుభ్రం చేశారు. అలాగే మురుగు కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టారు. దోమల నివారణ కోసం మందు పిచికారీ నిర్వహించామని అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ మరో రెండు రోజుల పాటు ప్రధాన రహదారుల్లో కొనసాగుతుందని పేర్కొన్నారు. గ్రామంలో పరిశుభ్రత మెరుగుపడి ప్రజారోగ్యం కాపాడేందుకు ఈ చర్యలు దోహదపడతాయని వారు తెలిపారు.