ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మూడేళ్ల క్రితం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’తో మంచి ట్రీట్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 భాషల్లో విడుదలైన ఆ సీక్వెల్ బాక్సాఫీసు కలెక్షన్లను కొల్లగొట్టింది. ఆ ఫ్రాంచైజీలో మూడో భాగాన్ని పంచభూతాల్లో ఒకటైన అగ్నికి సంబంధించిన కాన్సెప్ట్‌తో రూపొందించారు.