దుమ్మురేపుతున్న కటిక జలపాతం రోడ్డు
NEWS Dec 19,2025 12:36 am
అనంతగిరి మండలంలోని కటిక జలపాతంకు వెళ్లే మార్గంలో 8 నెలల క్రితం ప్రారంభించిన తారు రోడ్డు నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ప్రస్తుతం రోడ్డుపై కంకర పిక్కలు మాత్రమే వేసి వదిలేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ రోడ్డుపై ఆధారపడి ఉన్న 7 గ్రామాల గిరిజనులు నిత్య అవసరాలకు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. వాహనాల రాకపోకల కారణంగా దుమ్ము విపరీతంగా రేగుతుండటంతో శ్వాసకోస సంబంధిత సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించి తక్షణమే తారు రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసి గిరిజనులకు ఉపశమనం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.