బొర్రాగుహల రోడ్డును మరమ్మతులు చేయండి
NEWS Dec 19,2025 12:37 am
AP పర్యాటక కేంద్రంగా పేరుగాంచిన బొర్రా గుహలుకు వెళ్లే ప్రధాన రహదారి తీవ్రంగా ధ్వంసమైంది. రోడ్డుపై కంకర రాళ్లు తేలి, లోతైన గుంతలు ఏర్పడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దేశ నలుమూలల నుంచి వేల సంఖ్యలో పర్యాటకులు సందర్శించే ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు, పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, పర్యాటక బస్సులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. సంబంధిత ఆర్ అండ్ బి, నేషనల్ హైవే అధికారులు వెంటనే స్పందించి ధ్వంసమైన రహదారిని మరమ్మతు చేయాలని పర్యాటకులు, స్థానికులు కోరుతున్నారు.