టంగుటూరు వడ్డెపాలెంలో హత్య
NEWS Dec 19,2025 12:38 am
టంగుటూరు మండలం వడ్డెపాలెంలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. యనమన మంద వెంకట రమణయ్య (55) అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు అతని స్వగృహంలో తలపై కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు HDFC Bankలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.