కోటమ్మకు మాదాసి వెంకయ్య నివాళి
NEWS Dec 19,2025 12:39 am
కొండేపి మండలం మిట్టపాలెం గ్రామానికి చెందిన తుల్లూరి కోటమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు మాదాసి వెంకయ్య హాజరై, ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మిట్టపాలెం గ్రామ ఉప సర్పంచ్ మండవ మాల కొండయ్య, ఎస్సీ నాయకులు ఆదాం, నజీర్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులు, గ్రామస్తులు, యువత పాల్గొని కోటమ్మకు ఘనంగా నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు వారు సానుభూతి తెలియజేశారు.