సర్పంచ్ చామంతి శ్రీకాంత్‌కు శుభాకాంక్షలు
NEWS Dec 19,2025 12:40 am
రాఘవపూర్ గ్రామానికి నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ తాడిచెట్టు చామంతి శ్రీకాంత్‌కు పలువురు నాయకులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆశయాలకు అనుగుణంగా గ్రామ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేయాలని సర్పంచ్‌కు సూచించారు. రాఘవపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడంలో బీఆర్‌ఎస్ నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్, విలేజ్ ప్రెసిడెంట్ కొమురయ్య, కుమారస్వామి, రామస్వామి, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.