నూతన సర్పంచ్ నల్లగొండ కుమార్‌కు సన్మానం
NEWS Dec 19,2025 12:41 am
పెద్దపల్లి మండలం ముత్తారం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన నల్లగొండ కుమార్‌ను మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన సర్పంచ్‌ను సాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధి దిశగా ప్రజల ఆశయాలకు అనుగుణంగా పని చేసి, ముత్తారం గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.