సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
NEWS Dec 18,2025 12:03 pm
TG: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. మొదటి, రెండో విడతల్లో సుమారు 56 శాతం స్థానాలను గెలిచిన పార్టీ మూడో విడతలోనూ అదే ఆధిక్యాన్ని కొనసాగించింది. మొత్తం 4,159 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారులు 2,286 స్థానాలను గెలిచారు. BRS 1,142, BJP 242, ఇతరులు 479 స్థానాల్లో విజయం సాధించారు. వీరిలో సీపీఐ మద్దతుదారులు 24 చోట్ల, సీపీఎం వారు 7 చోట్ల గెలిచారు.