రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
NEWS Dec 17,2025 05:49 pm
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ముత్తరాసుపాలెం కాలనీకి చెందిన అనుముల అరుణ్ చంద్ (19) రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. టంగుటూరు టోల్ ప్లాజా వద్ద ముందు వెళ్తున్న కంటైనర్ లారీని బైక్‌పై వేగంగా వెళ్తూ ఢీకొనడంతో, అరుణ్ చంద్‌కు తీవ్ర గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.