అనర్హత పిటిషన్లను కొట్టి వేసిన స్పీకర్
NEWS Dec 17,2025 05:42 pm
ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్‌కుమార్ తీర్పు వెలువరించారు. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టి వేశారు. 5గురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు ఆధారాలు చూపలేకపోయారని చెప్పారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని, సాంకేతికంగా ఆ 5గురు ఎమ్మెల్యేలు BRSలోనే ఉన్నట్టు స్పష్టం చేశారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలు చేయగా.. 8 మందికి సంబంధించి విచారణ పూర్తి చేశారు. దానం, కడియంపై దాఖలైన పిటిషన్లకు సంబంధించిన విచారణ ఇంకా పూర్తి కాలేదు.