స్పీకర్ నిర్ణయంపై హైకోర్టుకు వెళతాం
NEWS Dec 17,2025 05:36 pm
TG: ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఇచ్చిన తీర్పుపై BRS స్పందించింది. తీర్పు కాపీని అధ్యయనం చేసిన తర్వాత స్పీకర్ నిర్ణయంపై హైకోర్టుకు వెళ్తామని BRS ఎమ్మెల్యేలు చెప్పారు. స్పీకర్ తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా వచ్చిన తీర్పుగా భావిస్తుమన్నారు. తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.