ANR కాలేజీకి నాగార్జున ₹2 కోట్ల విరాళం
NEWS Dec 17,2025 02:40 pm
కృష్ణా జిల్లా గుడివాడలోని ఏఎన్నార్ కళాశాల వజ్రోత్సవ కార్యక్రమంలో నాగార్జున పాల్గొని రూసా భవనాన్ని ప్రారంభించారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు చదువుకోలేదని, కానీ ఆయనకు చదువు విలువ తెలుసని, ఎంతోమంది విద్యార్థులకు బంగారు భవిష్యత్తు నివ్వాలని ఆయన తపనపడ్డారని తెలిపారు. విద్యార్థుల స్కాలర్ షిప్ ల కోసం ₹ 2 కోట్లు విరాళంగా అందిస్తున్నట్లు నాగార్జున ప్రకటించారు.