మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షునిగా శేఖర్
NEWS Dec 17,2025 01:45 pm
కథలాపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ అధిక సంఖ్యలో సర్పంచ్ స్థానాలను గెలుచుకొని అధికార పక్షంగా ముందు వరుసలో నిలిచింది. ఈ నేపథ్యంలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి సర్పంచులుగా ఎన్నికైన వారిలో మెజారిటీ సర్పంచులు, స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీను ఆదేశాల మేరకు కథలాపూర్ మండల కేంద్ర సర్పంచ్ న్యావనంది శేఖర్‌ను మండల్ సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అభివృద్ధి కోసం సమన్వయంతో పనిచేస్తామని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు న్యావనంది శేఖర్ తెలిపారు.