పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమిరే గ్రామానికి చెందిన శివాజీ (35) అనే కానిస్టేబుల్ తన వ్యవసాయ పొలంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నెలకొల్పింది. మృతుడు శివాజీ సిరిసిల్లా జిల్లా పోలీస్ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆత్మహత్యకు గల కారణాలపై పూర్తి వివరాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.