TG: సర్పంచ్ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థి గుండెపోటు తో మృతిచెందడంతో అతని వద్ద ఓటు కోసం తీసుకున్న డబ్బులను గ్రామస్థులు తిరిగిచ్చారు. ఈ ఘటన నల్గొండ జిల్లా మునుగోడు (మం) కిష్టాపురంలో జరిగింది. చెనగోని కాటంరాజు BRS మద్దతుతో పోటీ చేయగా 143 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓటమితో మనస్తాపానికి గురైన ఆయన గుండెపోటుకు గురై చనిపోయారు. ఓట్ల కోసం ఆయన పంచిన డబ్బును పలువురు గ్రామస్థులు జమ చేసి తిరిగి ఇచ్చేశారు.