మాజీ సైనికుడి మానవత్వం
NEWS Dec 16,2025 06:15 am
హైదరాబాద్‌లో వృద్ధులు, నిరాశ్రయులపై మాజీ సైనికుడు సురేష్‌బాబు మానవత్వాన్ని చాటుకు న్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరు(M) పగిడేరు గ్రామానికి చెందిన ఆయన, తన పిల్లలు అక్షయశ్రీ, ఆరెన్‌తో కలిసి అర్ధరాత్రి నగర సిగ్నళ్ల వద్ద చలితో వణుకుతున్న వారికి దుప్పట్లు కప్పారు. ఈ సేవా కార్యక్రమంలో లోకల్ పోలీస్ మిత్రులు, ఆర్మీ స్నేహితులు, నవోదయ పూర్వ విద్యార్థులు సహకరించగా, మ్యూజిక్ డైరెక్టర్ బల్లేపల్లి మోహన్ ముందుండి నడిపించారు.