గెలుపొందిన సర్పంచులకు కేటీఆర్ దిశానిర్దేశం
NEWS Dec 18,2025 11:50 am
సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రజలు మీపై నమ్మకం ఉంచి గెలిపించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని,ప్రజాక్షేత్రంలో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ, తమ వంతు సహాయ సహకారాలు అందించే విధంగా పనిచేయాలని నూతన సర్పంచులకు సూచించారు. వచ్చే ప్రభుత్వం తమదేనని, అభివృద్ధి దిశగా మళ్లీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.