అమెరికా ఓటుతో గెలిచిన కోడలు
NEWS Dec 15,2025 05:45 pm
ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు ఎంత విలువైందో చాటిచెప్పే ఆసక్తికర ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. కోడలు ఎన్నికల్లో నిలబడటంతో, ఆమెను గెలిపించడం కోసం అమెరికా నుంచి వచ్చిన మామ గారు వేసిన ఓటు ఆమె విజయంలో కీలకంగా మారింది. కేవలం ఒక్క ఓటు తేడాతో కోడలు సర్పంచ్‌గా విజయం సాధించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.