కథలాపూర్ మండలం కలిగోట సూరమ్మ ప్రాజెక్టు నిర్మాణం కోసం కుడి ఎడమ కాలువ పనులు నడుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో ఆర్డిఓ దివాకర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీవో ఎకరానికి 9 లక్షలు నష్టపరిహారంగా ఇస్తామని చెప్పడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు 20 లక్షల రూపాయలు ఇవ్వాలని లేకుంటే తమకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని భూమి పైనే ఆధారపడి జీవిస్తున్నామని వారు తెలిపారు. ప్రభుత్వం ఎకరానికి 20 లక్షల రూపాయలు నష్టపరియాల అందిస్తేనే తమ భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని లేకపోతే ఇవ్వబోమని తెలిపారు.