సూర్యాపేట జిల్లా కోదాడ (మం) గుడిబండ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, ఎస్ఐ. తన పదవీ విరమణకు ఇంకా 5 నెలల సమయం ఉండగానే, ఆయన VRS తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ పదవికి పోటీ చేశారు. ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఎదురుకావడంతో ఆయన ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఉద్యోగం వదులుకుని మరీ బరిలోకి దిగిన ఆయన నిర్ణయంపై ఇప్పుడు స్థానికంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.