మూడు బజార్ల వద్ద మూఢనమ్మకాల ప్రదర్శన ప్రజల్లో భయభ్రాంతులు
గురవుతున్నారు
NEWS Dec 15,2025 10:32 am
పట్టణంలోని 3 బజార్ల కూడలి వద్ద మూఢనమ్మకాలకు సంబంధించిన కార్యకలాపాలు కలకలం రేపుతున్నాయి. ఆకుపై గుడ్డు, నిమ్మకాయ, బియ్యం, కుంకుమ వంటి సామగ్రితో చేసిన ఈ చర్యలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ, ఇంకా ఇలాంటి అంధవిశ్వాసాలను కొనసాగించడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేటర్ స్థాయిలో ఆసుపత్రులు, వైద్య సిబ్బంది, అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నా కూడా అనారోగ్యాలు లేదా సమస్యలు వచ్చినప్పుడు వైద్యులను ఆశ్రయించకుండా మూఢనమ్మకాల వైపు మొగ్గుచూపడం శోచనీయమని స్థానికులు అంటున్నారు. ఇలాంటి చర్యల వల్ల ముఖ్యంగా చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు భయాందోళనకు గురవుతున్నారని, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.