చేగుంట మండలం చిన్న శివునూరు సర్పంచిగా చుంచునకోట వరలక్ష్మి విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వరలక్ష్మి సమీప ప్రత్యర్థి కొఠారి రేణుకపై గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. తమకు ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు వారు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.