'ఆటా' అంతర్జాతీయ సాహిత్య సదస్సు
NEWS Dec 14,2025 09:46 am
HYD: 'ఆటా' వేడుకల్లో భాగంగా తెలుగు విశ్వవి ద్యాలయంలో అంతర్జాతీయ సాహిత్య సదస్సు జరిగింది. ఈ సదస్సులో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్లా సాహిత్యంపై విస్తృత సమాలోచన, ఆయన సాహిత్య ఆవిష్కరణలు తెలుగు సాహితీ వేదికకు పరిచయం చేశారు. ATA అధ్యక్షుడు జయంత్ చల్లా, ATA డేస్ చైర్ సతీష్ రెడ్డి పర్యవేక్షణలో, వేణు నక్షత్రం సమన్వయంతో సదస్సు జరిగింది. హిందీ-తెలుగు సాహిత్య సమన్వయానికి ఇది ముఖ్య వేదికగా నిలిచింది. పలువురు సాహితీవేత్తలు, ATA బోర్డు సభ్యులు పాల్గొని అతిథులను సత్కరించారు.