నల్గొండ జిల్లా నార్కట్ పల్లి (మం) ఔరవాణిలో BRS మద్దతుదారుడు బాలరాజు.. ఎన్నికల్లో ఓట్ల కోసం 10 లక్షలకు పైగా ఖర్చు చేశాడు. 448 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి దేవుడి ఫొటో, పురుగు మందుల డబ్బ చేత పట్టుకుని ఇంటింటికి తిరుగుతూ .. ఓటుకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అభ్యర్థించాడు. డబ్బులు తీసుకున్న వారంతా ఓట్లు వేశామని చెప్పడంతో ఐతే ఎలా ఓడిపోయానంటూ ఓటర్లను నిలదీశాడు. దేవుడిపై ప్రమాణం చేసి ఓటు వేశారో లేదో చెప్పాలని... వేయకపోతే తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు.