ఓటేసేందుకు వెళ్తూ నలుగురు మృతి
NEWS Dec 13,2025 11:22 pm
మెదక్ జిల్లాలో శనివారం రాత్రి పెద్ద శంకరంపేట దగ్గర జాతీయ రహదారి 161పై గుర్తు తెలియని వాహనం బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులను కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ (మం) మాగీ గ్రామానికి చెందిన లింగమయ్య, సాయమ్మ, మానస, సాయిగా గుర్తించారు పోలీసులు. లింగమయ్య, సాయమ్మ దంపతులు కొడుకు, కూతురితో కలిసి హైదరాబాద్ నుంచి ఓటు వేయడానికి సొంతూరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.