ఉ. 7 నుంచి రెండో విడత పంచాయతీ పోలింగ్
NEWS Dec 13,2025 09:44 pm
TG: రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. తర్వాత 2 గంటల నుంచి ఓట్లను లెక్కించనున్నారు. సెకండ్ ఫేజ్‌లో 4,332 సర్పంచ్ స్థానాలకు గాను 415 స్థానాలు, 38,322 వార్డులకు 8,300 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన సర్పంచ్, వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో సిబ్బందికి పోలింగ్ సామగ్రిని అధికారులు అందజేశారు.