సర్పంచ్ శేఖర్‌కు ప్రభుత్వ విప్ సత్కారం
NEWS Dec 13,2025 03:04 pm
కథలాపూర్ మండల కేంద్రంలోని సర్పంచ్ న్యావనంది శేఖర్‌ను ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీను సాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆది శ్రీను మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లాలని సర్పంచ్‌కు హితవు పలికారు. గ్రామ అభివృద్ధినే ధ్యేయంగా, లక్ష్యంగా చేసుకొని సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రతి క్షణం అహర్నిశలు కృషి చేస్తే ప్రజలు రానున్న కాలంలో మళ్లీ ఎన్నుకుంటారని, తమ మద్దతు, ప్రోత్సాహం ఎల్లవేళలా ఉంటుందని ఆయన తెలిపారు. గ్రామ అభివృద్ధికి సంబంధించి ఎమ్మెల్యేకు వివరించగా సానుకూలంగా స్పందించారని సర్పంచ్ న్యావనంది శేఖర్ తెలిపారు. గ్రామ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని, ప్రతి సమస్యపై స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు.