15న రవీంద్రభారతిలో బాలు విగ్రహావిష్కరణ
NEWS Dec 13,2025 01:25 pm
TG: ఈ నెల 15న రవీంద్రభారతిలో ది మ్యూజిక్ గ్రూప్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో SP బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని CM రేవంత్, మాజీ VP వెంకయ్య ఆవిష్కరించనున్నారు. అదేరోజు 4PMకు సినీ సంగీత స్వరనీరాజనం ఉంటుందని సంస్థ అధ్యక్షుడు అచ్యుత రామరాజు తెలిపారు. ఎంట్రీ పాసుల కోసం 14న 3pmకు రవీంద్ర భారతిలో కౌంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇటీవల బాలు విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.