ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ సుడిగాలి పర్యటన
NEWS Dec 13,2025 03:06 pm
చర్ల ఏజెన్సీ ప్రాంతంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక మండలంలోని ఏజెన్సీ ప్రాంత గిరిజన హాస్టళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హాస్టళ్లలో ఉన్న సివిల్ వర్క్స్‌కు సంబంధించిన సమస్యలపై ప్రిన్సిపాళ్లు, హెచ్‌ఎంలు, వార్డెన్‌లతో సమగ్రంగా చర్చించి, అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. అనంతరం రొట్టెటి వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన పనులను పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డీఈ హరీష్, ఏఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.