సర్పంచ్ విజయం కోసం వేములవాడకు పాదయాత్ర
NEWS Dec 13,2025 09:31 am
కథలాపూర్ మండలంలో సర్పంచ్‌గా తన అన్న శేఖర్ గెలిచినట్లయితే వేములవాడకు పాదయాత్ర చేస్తానని రాజరాజేశ్వర స్వామికి మొక్కుకున్న మహేష్, తన అన్న విజయం సాధించడంతో మొక్కును నెరవేర్చారు. మండల కేంద్రంలోని సర్పంచ్ అభ్యర్థి శేఖర్ గెలుపొందడంతో గ్రామం నుంచి వేములవాడ వరకు 45 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్లి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ పాదయాత్ర ద్వారా మహేష్ తన అన్నపై ఉన్న ప్రేమను, భక్తిని చాటుకున్నారని గ్రామస్తులు తెలిపారు. మొక్కు చెల్లించుకున్న మహేష్‌ను గ్రామ ప్రజలు అభినందిస్తూ ప్రశంసించారు.