ప్రజల ఆశీర్వాదమే: ప్రసాద్ రెడ్డి
NEWS Dec 13,2025 01:19 pm
కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో కరోనా విపత్కర సమయంలో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవలు అందించిన సర్పంచ్ అభ్యర్థి సుధాకర్‌ను గ్రామ ప్రజలు ఎన్నుకోవడం హర్షించదగ్గ విషయమని గ్రామ వీడిసి అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి అన్నారు. ఉప సర్పంచ్‌గా పిడుగు తిరుపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కూడా ప్రజల ఆశీర్వాదమేనని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్, ఉప సర్పంచ్‌లు ఎల్లవేళలా కృషి చేయాలని సూచించారు. ప్రజాభివృద్ధి క్షేత్రంలో వీరిద్దరూ ఏకాభిప్రాయంతో పనిచేయాలని, ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో దూకుడుగా ముందుకు సాగాలని తెలిపారు. సర్పంచ్, ఉప సర్పంచ్‌లను శాలువాలతో సన్మానించి, స్వీట్లు పంపిణీ చేశారు.