పిడుగు తిరుపతిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
NEWS Dec 13,2025 01:18 pm
కథలాపూర్ మండలం బొమ్మన గ్రామ ఉప సర్పంచ్‌గా పిడుగు తిరుపతిరెడ్డిని వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నిక అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని, ప్రతి వార్డులో పచ్చదనం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ వీడిసి అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి సాలువాతో సన్మానించారు. గ్రామ అభివృద్ధిలో యువత ముందుండేలా ప్రజలు తీర్పు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పిడుగు లావణ్య తిరుపతిరెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.