ATA వేడుకలు: విద్యార్థులకు స్కాలర్షిప్స్
NEWS Dec 12,2025 06:02 pm
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) సేవల ను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశంసించారు. రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడ ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు 'ఆటా' ప్రెసిడెంట్ జయంత్ చల్లా - కవిత దంపతుల ఆధ్వర్యంలో స్కాలర్షిప్‌లు పంపిణీ చేశారు. సబితా ఇంద్రారెడ్డి, TUFIDC చైర్మన్ నరసింహరెడ్డి అతిథులుగా హాజరై ఆటా సేవలను కొనియాడారు. జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి ఆటా సేవా కార్యక్రమాలను వివరించారు. ఆటా ట్రస్టీలు, ప్రతినిధులు పాల్గొని ఉపాధ్యాయులను అభినందించారు.