'ఆటా' వేడుకలు 2025 ప్రారంభం
NEWS Dec 12,2025 06:08 am
HYD: అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA) వేడుకలు 2025 ప్రారంభమయ్యాయి. ప్రెస్‌క్లబ్ ప్రెస్‌మీట్‌లో 'ఆటా' అధ్యక్షుడు జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి నేటి నుంచి ఈ నెల 27 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా 16 రోజుల పాటు పలు సేవా, విద్యా, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలి రోజు రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేత, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.