ఐసీసీ శుభవార్త చెప్పింది. 2026లో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకాలను ఈరోజు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ రోజు సాయంత్రం 6:45 గంటల నుంచి https://tickets.cricketworldcup.com/ వెబ్‌సైట్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయి. భారత్‌లో కొన్ని వేదికల్లో టికెట్ ధరలు కేవలం రూ.100 నుంచి ప్రారంభం కానుండటం విశేషం.