MLAల జీతాలు భారీగా పెంచిన ఒడిశా
NEWS Dec 10,2025 11:51 pm
ఒడిశాలో MLAల జీతాలు భారీగా పెరిగాయి. తమ జీతాన్ని దాదాపు మూడు రెట్లు పెంచే బిల్లుకు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. జీతం, అలవెన్సులతో కలిపి గతంలో నెలకు రూ.1.11లక్షలు ఉండగా ఇప్పుడు ఇది ఏకంగా రూ.3.45 లక్షలకు చేరింది. దీంతో దేశంలో MLA జీతం అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. ఇప్పటివరకూ ఈ స్థానంలో తెలంగాణ ఉండేది. ఇక్కడి శాసనసభ్యుల జీతం రూ.2.5లక్షలుగా ఉంది.