బంగారంతో పాటు ఇన్నాళ్లు పెరిగిన వెండి.. ఇప్పుడు పసిడిని దాటేసి పరుగులు పెడుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బుధవారం రూ.1.92 లక్షలు పలుకుతోంది. ఏడాది క్రితం రూ.లక్ష మార్కును దాటిన వెండి.. ఇప్పుడు రూ.2 లక్షల మార్కు దిశగా దూసుకెళుతోంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1.32 లక్షలు పలుకుతుండగా.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1.20 లక్షల వద్ద ఉంది.