తెలంగాణలో సల్మాన్ భారీ పెట్టుబడులు
NEWS Dec 10,2025 01:11 pm
సల్మాన్ ఖాన్ తెలంగాణలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చాడు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో సల్మాన్‌కు చెందిన వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ₹10 వేల కోట్ల పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్, అత్యాధునిక ఫిల్మ్ స్టూడియోను నిర్మించబోతోంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు వద్ద భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ప్రతిపాదితమైంది. టౌన్‌షిప్‌లో గోల్ఫ్ కోర్సు, రేస్ కోర్సు, ప్రీమియం రెసిడెన్షియల్ స్థలాలు, ఫిల్మ్ ప్రొడక్షన్, ఓటీటీ, పోస్ట్ ప్రొడక్షన్‌కు అత్యాధునిక సదుపాయాలు ఉండనున్నాయి. ఈ పెట్టుబడితో వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.