త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ హీరోగా నటిస్తున్న సినిమాకు ‘ఆదర్శ కుటుంబం’ అనే టైటిల్ ఖరారైంది. ‘AK 47- హౌస్ నం. 47’ అనేది క్యాప్షన్. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మూవీ టీమ్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. హారిక&హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై చినబాబు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈరోజు షూటింగ్ ప్రారంభమైంది. 2026 సమ్మర్‌లో మూవీని రిలీజ్ చేస్తామని హీరో వెంకటేశ్ వెల్లడించారు.