దూరు లక్ష్మణదొర కన్నుమూత
NEWS Dec 10,2025 07:30 am
అల్లూరి జిల్లాలోని అనంతగిరి మండలం పినకోట పంచాయతీ కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది. పినకోట గ్రామ అభివృద్ధికి జీవితాన్ని అంకితం చేసిన సామాజిక సేవకుడు దూరు లక్ష్మణదొర కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామ అభివృద్ధి పట్ల అపారమైన ప్రేమ, సేవాభావంతో దూరు లక్ష్మణదొర కీలక సేవలు అందించారు. తన స్వంత జిరాయితి భూమిలో 8 ఎకరాలను పాఠశాల, హాస్పిటల్, అలాగే ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం ఉచితంగా దానం చేశారు. గ్రామంలో పాఠశాల, ఆసుపత్రి, విద్యుత్ వంటి కనీస సదుపాయాలు ఏర్పడాలన్న ధృఢ సంకల్పంతో ఆయన అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి వరకు వెళ్లి సమస్యలను వినిపించి వాటి పరిష్కారానికి నిరంతరంగా కృషి చేశారు. ఆయన చేసిన సేవలు గ్రామ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతాయని గ్రామస్థులు భావోద్వేగంతో పేర్కొన్నారు.