అదృష్టాన్ని వరించిన రూ.50 లక్షల వజ్రం!
NEWS Dec 10,2025 11:15 am
పన్నా: మధ్యప్రదేశ్‌కు చెందిన సతీశ్ ఖాతిక్ (24), సాజిద్ మొహమ్మద్ (23) ఆర్ధిక సమస్యలు, సోదరీమణుల వివాహాల కోసం నిధులు సమకూర్చడంలో ఇబ్బందులు పడుతున్నారు. లీజుకు తీసుకున్న ఓ చిన్న గనిలో తవ్వకాలు చేపట్టగా, వీరికి 15.34 క్యారెట్ల వజ్రం దొరికింది. దీని ఖరీదు రూ.50 లక్షలుగా అధికారులు అంచనా వేశారు. దీనిని వేలం వేయనున్నారు. వేలం ద్వారా వచ్చే డబ్బును సమానంగా పంచుకుని, ముందు తమ సోదరీమణుల వివాహాలకు ఖర్చు చేసి, మిగిలిన డబ్బుతో వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు.