T20: సఫారీలపై భారత్ విజయం
NEWS Dec 09,2025 10:40 pm
సఫారీలతో వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న టీమిండియా.. అదే జట్టుతో 5 టీ20ల సిరీస్‌లో శుభారంభం చేసింది. తొలి టీ20లో భారత్ 101 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. సఫారీలు 12.3 ఓవర్లలో 74 పరుగులకే కుప్పకూలారు. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్య (59*; 28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ బాదాడు. అక్షర్ పటేల్ (26), తిలక్ వర్మ (26), అభిషేక్ శర్మ (17), సూర్యకుమార్ (12) పరుగులు చేశారు.