తొలి విడత ఎన్నికల ప్రచారం పూర్తి
NEWS Dec 09,2025 08:37 pm
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత ప్రచారం నేటి సాయంత్రంతో గడువు ముగిసింది. 11 తేదీ (ఎల్లుండి) ఉ. 7 గంటల నుంచి మ. 1 గంట వరకు తొలి విడత పోలింగ్ జరగనుంది. ఈ విడతలో మొత్తం 189 మండలాల్లోని 4,235 గ్రామ పంచాయతీలకు సంబంధించి 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. వీరిలో 27,41,070 మంది పురుషులు, 28,78,159 మంది మహిళలు, 201 మంది ఇతర లింగంలోని ఓటర్లు ఉన్నారు. పోలింగ్ సజావుగా సాగేందుకు 37,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసిన వెంటనే, కౌంటింగ్ ప్రారంభమై, ఫలితాలు ప్రకటిస్తారు.